KTR | పానీపూరి బాధిత చిన్నారులను పరామర్శించిన కేటీఆర్, హరీశ్ రావు.. వీడియో
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని కేసీఆర్ నగర్ కాలనీ, అంకుసాపూర్‌లో మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. వీరిని కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్, హరీశ్‌రావు అస్వస్థతకు లోనైన వారు పూర్తిగా కోలుకునేలా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.
ముందుగా ఈ ఘటన జరిగిన వెంటనే కేటీఆర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లిలో పానీపూరి తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/DeEpp91VJf
— BRS Party (@BRSparty) June 18, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన కేటీఆర్, హరీష్ రావు https://t.co/ArRJRm4QUH pic.twitter.com/kQHzbJRvQQ
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2026
Read Also :
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

