Komatireddy Venkat Reddy | హైదరాబాద్ : బతుకమ్మ పండుగను అవమానిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోరు పారేసుకున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.
బతుకమ్మ పూల లోపల బాటిల్ పెట్టి.. మహిళలు దాని చుట్టూ తిరిగి పండగ చేసుకున్నారు. బతుకమ్మ పూలలో బాటిల్ ఉన్న విషయం మహిళలకు తెలియదు. ఇప్పుడు ఆ విషయం మహిళలకు తెలిసింది అని బతుకమ్మ పండుగను అవమానించేలా మాట్లాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కవిత కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు అలా మాట్లాడొచ్చా..? తలకాయ నేలకేసుకొని.. జడ్జి బెయిల్ రిజెక్ట్ చేస్తే మళ్లీ బయటకు పోవాలి. ఆమె గట్ల అనుకుంటు పోవడం ఏందో నాకు అర్థమైతలేదు. ఆమె ఏమైనా ఉద్యమం చేసిందా..? ఎన్నికల్లో టైడ్ అయి ఉంటాం కదా.. రిలాక్స్ అయ్యేందుకు, నవ్వుకునేందుకే ఈ విషయం చెబుతున్నాను అని కోమటిరెడ్డి వెకిలిగా మాట్లాడారు.
బతుకమ్మ పండుగను అవమానించిన మంత్రి కోమటిరెడ్డి
బతుకమ్మ పూల లోపల బాటిల్ పెట్టి.. మహిళలు దాని చుట్టూ తిరిగి పండగ చేసుకున్నారు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి pic.twitter.com/zozBWZHrz9
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2024