Tarique Rahman | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని ఖాలిదా జియా (Khaleda Zia) కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ (Tarique Rahman) ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టారు. దాదాపు 17 ఏండ్ల తర్వాత ఇవాళ ఢాకా చేరుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్, అతని కుటుంబ సభ్యులకు ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని రేసులో తారిక్ ముందు వరుసలో ఉన్నారు. గత 17 ఏళ్లుగా ఆయన లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తల్లి ఖాలిదా జియా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు నెలరోజుల ముందు ఆయన స్వదేశానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
Blast At Mosque | మసీదులో బాంబు పేలుడు.. ఏడుగురు మృతి
కాలిఫోర్నియాలో 30 మంది భారతీయ డ్రైవర్ల అరెస్ట్
డేట్ కెళితే రూ.30 వేల ప్రోత్సాహకం