సియోల్: డేట్‌కు కెళ్లండి.. సొమ్ము తీసుకోండి.. అంటూ యువతను బతిమలాడుతున్నది దక్షిణ కొరియా ప్రభుత్వం. రోజురోజుకూ తగ్గిపోతున్న జనాభా, అతి తక్కువ జనన రేటు నమోదు పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్న ప్రభుత్వం యువ జంటలను వివాహం వైపు ప్రోత్సహించడానికి ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా బుసాన్ నగర ప్రభుత్వం డేటింగ్ చేయమంటూ యువతను ఆహ్వానించింది. డేటింగ్ చేసే జంటకు రూ.30 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తున్నది. తర్వాత వారు కనుక వివాహం చేసుకుంటే రూ.12 లక్షలు అందజేస్తుంది. అలాగే వారు ఇల్లు కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. 24 ఏండ్ల నుంచి 43 ఏండ్ల వయసున్న వారెవరైనా ఈ కార్యక్రమంలో చేరవచ్చు. ఇందులో చేరాలనుకునే వారు ఒక దరఖాస్తు నింపాలి. తర్వాత వారికి స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఉంటుంది.