PM Modi | దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్ (Cathedral Church of the Redemption)లో ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభు యేసుకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఉత్సాహాన్ని పంచే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు.
PM Narendra Modi tweets, “Attended the Christmas morning service at The Cathedral Church of the Redemption in Delhi. The service reflected the timeless message of love, peace and compassion. May the spirit of Christmas inspire harmony and goodwill in our society.” pic.twitter.com/iXJNUq34l9
— ANI (@ANI) December 25, 2025
Also Read..
Nitin Gadkari | హమాస్ నేత హనియా హత్య సమయంలో అక్కడే ఉన్నా.. ఆయన్ని కలిశా : నితిన్ గడ్కరీ
Indian Vlogger | భారత వ్లాగర్ను నిర్బంధించిన చైనా
Bus accident | కర్నాకటలో ఘోర బస్సు ప్రమాదం..17 మంది సజీవ దహనం