ఊట్కూర్, డిసెంబర్ 25: ఏసు ప్రభువు(Jesus)బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం కొల్లూరు గ్రామంలో ఇవాళ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇమోనియోలు చర్చిలో జరిగిన వేడుకలకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్టియన్ సోదరులకు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు శాంతి, కరుణ, ప్రేమను పంచుకోవాలని సూచించారు.
పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలతో మాజీ ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. గ్రామ సర్పంచ్ సింగారం సువర్ణ శ్రీనివాసులు, ఉప సర్పంచ్ గూర కొండ కవిత సురేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు అరవింద్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ సరోజ సమృద్ధి, క్రిస్టియన్ సోదరులు పశువుల నర్సింలు, ఎద్దుల ఏసు, వాసు, ఆనంద్ రాజ్ పాల్గొన్నారు.