ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధర్మసంకటంలో పినరాయి ప్రభుత్వం
కేరళ హైకోర్టు ఆరేండ్ల క్రితం నాటి తీర్పును ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న ముస్లింలకు 80 శాతం స్కాలర్షిప్ రాజ్యాంగ విరుద్ధమని తన తీర్పులో పేర్కొన్నది

తిరువనంతపురం : కేరళ హైకోర్టు ఆరేండ్ల క్రితం నాటి తీర్పును ప్రకటించింది. గ్రాడ్యుయేషన్ చదువుతున్న ముస్లింలకు 80 శాతం స్కాలర్షిప్ రాజ్యాంగ విరుద్ధమని తన తీర్పులో పేర్కొన్నది. కోర్టు తీర్పుపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. క్రైస్తవులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాగా, హైకోర్టు తీర్పుతో కేరళలోని పినరాయి ప్రభుత్వం ధర్మసంకటంలో పడిపోయింది.
కేరళ రాష్ట్ర ప్రభుత్వం 6 సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేషన్ చదువుతున్న ముస్లింలకు మైనారిటీ పేరిట 80 శాతం స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన 20 శాతం స్కాలర్షిప్ క్రైస్తవులకు ఇస్తున్నారు. ఈ నిర్ణయంపై సీనియర్ హైకోర్టు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. కేరళ ప్రభుత్వం నిర్ణయాన్ని తాజా తన తీర్పులో తప్పుపట్టింది. ఇలా స్కాలర్షిప్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించింది. కేరళ హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కోర్టు ఈ నిర్ణయంతో ముస్లింలు చాలా ఆగ్రహంతో ఉండగా.. క్రైస్తవులు మాత్రం హైకోర్టు తీర్పును సహేతుకంగాఉన్నదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్ మణికుమార్, జస్టిస్ షాజీ పీ చెలి ధర్మాసనం వెలువరించింది. కోర్టు తీర్పు ప్రతి ఇంకా అందలేదని, అందిన తర్వాత పూర్తిగా చదివి అధికారులతో చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పారు. కేరళలో ముస్లింల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కోర్టులో వాస్తవాలను సమర్పించడంలో సర్కార్ విఫలమైందని ఐయూఎంఎల్ ఆరోపిస్తున్నది.
కాగా, తీర్పును వెంటనే అమలు చేయాలని క్రైస్తవ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. హైకోర్టు తీరపును ప్రభుత్వం అమలు చేసి తమకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు జాకబ్ బిషప్ జోసెఫ్ గ్రెగోరియస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

