తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
ప్రపంచంలోనే తొలి హిందీ వార్తపత్రిక ఉదాంత్ మార్తాండ్ ను 1826 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు 19 నెలలకే మూసివేయవలసి వచ్చింది. తొలుత వారపు లేఖగా ప్రారంభమైంది

ప్రపంచంలోనే తొలి హిందీ వార్తపత్రిక ఉదాంత్ మార్తాండ్ ను 1826 లో సరిగ్గా ఇదే రోజున ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు 19 నెలలకే మూసివేయవలసి వచ్చింది. తొలుత వారపు లేఖగా ప్రారంభమైంది. ఈ 8 పేజీల వార్తాపత్రిక ప్రతి మంగళవారం బయటకు వచ్చేది. కాన్పూర్‌లో జన్మించి వృత్తిరీత్యా న్యాయవాది అయిన పండిట్ జుగల్ కిషోర్ శుక్లా ఈ పత్రికను స్థాపించి సంపాదకుడి పనిచేశారు. ఉదాంత్ మార్తాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా భారతీయుల స్వరంగా నిలిచింది.
ఈ కారణంగా వార్తాపత్రిక సంస్థ ప్రభుత్వం దృష్టిలో పడటం ప్రారంభించింది. ప్రభుత్వం వార్తాపత్రిక ప్రచురణలో చట్టపరమైన అడ్డంకులు పెట్టడం మొదలుపెట్టింది. పలు సౌకర్యాలను నిలిపివేసి అణచివేత ధోరణికి పాల్పడినప్పటికీ 19 నెలలపాటు కొనసాగింది. చివరకు 1827 డిసెంబర్ 18 న ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఈ పత్రికను మూసివేశారు. ఉదాంత్ మార్తాండ్ పత్రిక స్థాపనకు గుర్తుగా యేటా మే 30 వ తేదీన హిందీ జర్నలిజం డే ను పాటిస్తున్నారు.
భారతదేశంలో వార్తాపత్రికలు 1780 జనవరి 20 న ప్రారంభమయ్యాయి. ఒక ఆంగ్లేయుడు జేమ్స్ అగస్టస్ హిక్కీ ఆంగ్లంలో ‘కలకత్తా జనరల్ అడ్వర్టైజర్’ అనే మొదటి వార్తాపత్రికను ప్రారంభించారు. ఇది ఆసియా ఉపఖండంతో పాటు భారతదేశంలోని ఏ భాషలోనైనా మొదటి వార్తాపత్రికగా నిలిచింది. దీని తర్వాత క్రమంగా భారతదేశంలో వార్తాపత్రికల ప్రచురణ ప్రక్రియ ఊపందుకున్నది. బెంగాలీ, పెర్షియన్, ఉర్దూ భాషలలోని వార్తాపత్రికలు ప్రచురించడం ప్రారంభమైంది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2019 : రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ
2015: ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన అలెస్టర్ కుక్
2012: 5 వ సారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్
1998: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం, 5000 మంది దుర్మరణం
1987: భారతదేశంలో 25 వ రాష్ట్రంగా అవతరించిన గోవా
1981: బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియా ఉర్ రెహ్మాన్ హత్య
1919: జలియన్‌వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా నైట్ హుడ్ అవార్డును తిరిగిచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్
1883: న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ వంతెనపై తొక్కిసలాట, 12 మంది మృతి
1498: ఆరు నౌకలతో మూడవసారి అమెరికాకు ప్రయాణాన్ని ప్రారంభించిన కోలంబస్
ఇవి కూడా చదవండి..
చైనాలో కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్
లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

