‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళితనూజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సోమవారం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. జీవితాన్ని సరదాగా గడిపే యువకుడి కథ ఇదని, దొంగతనాల నేపథ్యంలో కామెడీ థ్రిల్లర్‌గా సాగుతుందని, ఆద్యంతం వినోదప్రధానంగా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. సుష్మితశెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్యబాలాజీ, సంగీతం: సింజిత్ యర్రమిల్లి, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: శ్రీను కంబాల.