ఇటీవల ‘మైసా’ సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న సందర్భంలో తీవ్రంగా గాయపడింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. డాక్టర్లు ఆరు వారాల విశ్రాంతిని సూచించారు. వారి సలహా మేరకు ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కాలి గాయంపై రష్మిక మందన్న ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ‘గాయాలు కావడం చిరాకుగా అనిపిస్తుంది. అసలు ఈ గాయం గురించి ఎవరికీ తెలియకూడదనుకున్నా. కానీ తెలిసిపోయింది. ఇలాంటి గాయం కావడం ఇది మూడోసారి. ఎవరూ టెన్షన్ పడొద్దు. ఈ గాయం నొప్పిగా అనిపిస్తున్నా..భరించలేనంతగా ఏమీ లేదు. నేను షూటింగ్స్‌లో బిజీగా ఉంటూ విరామం తీసుకోవడం లేదనే కారణంతో.. దేవుడు ఈ గాయాన్ని చేసి నా వృత్తికి విరామాన్ని ఇచ్చాడేమో అనుకుంటున్నా’ అంటూ స్మైలీ ఏమోజీలతో రష్మిక మందన్న చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.