e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి

లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి

లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి

చెన్నై : రెండేండ్ల క్రితం జమ్ముక‌శ్మీర్‌లో జరిగిన పుల్వామా దాడిలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భార్య నికితా కౌల్.. తన భర్త వారసత్వాన్ని కొనసాగించడానికి ఆలివ్ గ్రీన్ దుస్తుల‌ను ధరించింది. నాడు భర్తను సగర్వంగా సాగనంపిన ధీర వనిత.. ఇప్పుడు ఆయన వారసురాలిగా సైన్యంలో చేరింది. శనివారం చెన్నైలో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో నిఖిత ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీ స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు. ఆమె మూడు రోజుల క్రితం ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించింది.

2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మేజర్‌ విభూతి శంకర్‌ అమరుడ‌య్యాడు. అప్పటికి ఆయనకు వివాహమై తొమ్మిది నెలలే అయింది. 27 ఏండ్ల‌ వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. కానీ ఆమె మాత్రం జాలి కాదు.. గర్వపడాల‌ని చెప్పింది. ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని ‘ఐ లవ్యూ’ అని చెప్పి ముద్దుతో ఆయన్ని సాగనంపింది. అంతేకాదు, భర్త మీద ప్రేమతో ఆయన బాధ్యతను కూడా పంచుకున్నారు. ఢిల్లీలో ఎంఎన్‌సీ ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ రాతపరీక్షనూ, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూనూ విజయవంతంగా పూర్తిచేశారు.

‘విభూ.. నీ దారిలో నా ప్రయాణం మొదలైంది..

‘‘నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఐ లవ్‌ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అని ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. భర్తతోపాటు ఆయన బాధ్యతనీ ప్రేమించి, దేశానికి సేవ చేయాలన్న తన కలను కొనసాగించడానికి కొత్త ప్రయాణం మొదలుపెట్టిన నిఖితా కౌల్‌ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఎస్పీ నేత అజంఖాన్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

తిటు ద్వీపంపై చైనాకు ఫిలిప్పీన్స్‌ సవాలు

కుక్క‌ల్లో దొరికిన క‌రోనా వైర‌స్ మ‌నుషుల్లో గుర్తింపు

కేర‌ళ‌కు 100 కి.మీ దూరంలో నైరుతి రుతుపవనాలు

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మూడు చారిత్ర‌క నిర్ణ‌యాలు

2021 సెష‌న్ కోసం ఆన్‌లైన్ కోర్సుల‌ను ప్రారంభించిన యూజీసీ

వ్యాక్సిన్ వేసుకుంది.. లాట‌రీ కొట్టేసింది..

నా రూటే సెప‌రేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..

ఎవ‌రెస్ట్‌ను అధిరోహించిన నార్గే, హిల్ల‌రీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి

ట్రెండింగ్‌

Advertisement