కౌలాలంపూర్ : కుక్కలలో కనిపించే కరోనావైరస్ మానవులలో గుర్తించారు. మలేషియాలో న్యుమోనియాతో బాధపడుతున్న ఎనిమిది మంది రోగుల్లో కుక్కల్లో దొరికిన కరోనా వైరస్ కనుగొన్నారు. శాస్త్రీయ భాషలో దీనిని కనైన్ వైరస్ అని పిలుస్తారు. కుక్కల్లోని వైరస్‌ను మనుషుల్లో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొన్నది.
శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం.. కనైన్ వైరస్ సార్స్ కోవ్ -2 నుంచి భిన్నంగా ఉంటుంది. కరోనాను ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనే నాలుగు భాగాలుగా విభజించారు. ప్రపంచవ్యాప్త ఇన్ఫెక్షన్ ఏజెంట్ కరోనా బీటా కరోనావైరస్ సమూహానికి చెందినది. అదే సమయంలో కనైన్ వైరస్‌కు ఆల్ఫా కరోనావైరస్ సమూహానికి సంబంధం ఉన్నది. దాదాపు 50 సంవత్సరాలుగా కనైన్ వైరస్ గురించి శాస్త్రవేత్తల వద్ద సమచారం ఉన్నది.
కనైన్ వైరస్ నివేదిక ప్రకారం, ఇటీవల శాస్త్రవేత్తలు అన్ని రకాల కరోనావైరస్లను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పరీక్షను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పరీక్షకు పాన్-కోవ్ టెస్ట్ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం సమయంలో 92 నమూనాల పరిశోధనలో 10 మంది రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నమూనాల్లోని నాలుగింటిలో కుక్కల్లోని వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. దవాఖానలో మరో 4 కనైన్ వైరస్ కేసులు బయటపడ్డాయి. న్యుమోనియాతో బాధపడుతున్న 8 మంది రోగులలో.. ఏడుగురికి ఇతర రకాల వైరస్ సోకినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలో అడెనోవైరస్లు, ఇన్ఫ్లుఎంజా , పారాఇన్ఫ్లూయెంజా వైరస్లు ఉన్నాయని వారంటున్నారు.
కేరళకు 100 కి.మీ దూరంలో నైరుతి రుతుపవనాలు
పర్యావరణ పరిరక్షణకు మూడు చారిత్రక నిర్ణయాలు
2021 సెషన్ కోసం ఆన్లైన్ కోర్సులను ప్రారంభించిన యూజీసీ
వ్యాక్సిన్ వేసుకుంది.. లాటరీ కొట్టేసింది..
నా రూటే సెపరేటు అన్నాడు.. పుష్ అప్స్ తీయించాడు..
ఎవరెస్ట్‌ను అధిరోహించిన నార్గే, హిల్లరీ.. చరిత్రలో ఈరోజు
ఇమ్యూనిటీ కోసం జింక్ లభించే 5 ఆహారాలు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..