నల్గొండ : జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన గాలివాన ( Storm ) బీభత్సం సృష్టించింది. కలెక్టర్ ఆఫీస్ వెనక వైపు ఉన్న ఆర్టీవో కార్యాలయం వద్ద ఉన్న జిరాక్స్ షాపులు( Xerox shops ) , హోటల్స్ రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, ఇతర సామగ్రి వానకు తడిసిపోయాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.