తుంగతుర్తి, మే 28 : తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్ రావు, మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిలు గౌడ్, తడకమళ్ల రవికుమార్, వెంకటనర్సు, వెంకన్న, లింగయ్య, మల్లికార్జున్, వెంకటేష్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.