Varanasi | మహేశ్ బాబు కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు. మాధవన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న వారణాసి కొత్త షెడ్యూల్ వార్త ఒకటి నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది.
జక్కన్న టీం నెక్ట్స్ సినిమాలో వచ్చే ఓ భారీ వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తుందట. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్, భారీ సెట్స్, ఇంటెన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ లాంటి కీ ఎలిమెంట్స్ తో ఈ షెడ్యూల్ కొనసాగనుందట. తాజా టాక్ ప్రకారం నాన్ స్టాప్ నెల పాటు రాజమౌళి టీం ప్లాన్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. సినిమాలో ఇదే బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అని.. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటిదాకా ఎవరూ ప్రయత్నించని విధంగా ఈ సీక్వెన్స్ ఉండబోతుందన్న వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌తోపాటు మహేశ్ బాబు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇదే నిజమైతే జక్కన్న మరోసారి తన రికార్డులను తానే బీట్ చేయడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయన్నట్టు ఇప్పటికే ప్రకటించింది టీం. సెకండ్ పార్ట్ 2029లో వస్తుందని వార్తలు రాగా.. రాజమౌళి టీం రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.