Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
దస్తురాబాద్ : దస్తూరాబాద్ మండలంగా ఏర్పడి నేటికి పదేళ్లు అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా దస్తురాబాద్ 2016 అక్టోబర్11న కొత్త మండలంగా అవతరించింది.
దస్తురాబాద్ : దస్తూరాబాద్ మండలంగా ఏర్పడి నేటికి పదేళ్లు అవుతోంది. పరిపాలనను ప్రజలకు మరితం చేరువ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా దస్తురాబాద్ 2016 అక్టోబర్11న కొత్త మండలంగా అవతరించింది. మండలం ఏర్పాటుతో దస్తురా బాద్ కేంద్రంగా రెవెన్యూ, పంచాయతీ, విద్య, వ్యవసాయం, పోలీస్, తదితర ప్రభుత్వ శాఖల సేవలు ప్రజలకు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయి.
మండలంగా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. దస్తురాబాద్ ప్రత్యేక పరిపాలనా గుర్తింపు రావడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు, పథకాలు మరింత క్రమబద్ధంగా చేరేందుకు అవకాశం ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో రహదా రుల రూపురేఖలు మారాయి. మండలం మీదుగా డబుల్
రోడ్డు నిర్మించారు. మండల కేంద్రం నుంచి మున్యాల వరకు, మండల కేంద్రం నుంచి భూత్కూర్ గొండు గూడెం వరకు బీటీ రోడ్లు నిర్మించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల దశాబ్దాల కల నేరవేరింది.

మండలం ఏర్పాటైన తర్వాత కేజీబీవీ పాఠశాల మంజూరవడంతో ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. అలాగే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన భవనాన్ని నిర్మించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలంలో చేపట్టిన అభివృధ్ధి పనులను, మండలం అభివృద్ధిపై అప్పటి పాలకులు ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
పెండింగ్‌లో అభివృద్ధి పనులు
మండలం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ కాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించి, మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆకొండపేట, గొడిసేర్యాల, భూత్కూర్, ము న్యాల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. అప్పటి ప్రస్తుతం అవి అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను పూర్తి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- Dasturabad
- KCR
- KGBV schools
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

