Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Newzealand Cricket : స్వదేశంలో భారత జట్టుతో వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ (Newzealand Cricket) విధ్వంసక ఓపెనర్లను స్క్వాడ్‌లోకి తీసుకుంది. పలువురు ఆటగాళ్లు గాయపడడంతో.. డేంజరస్ ఫిన్ అలెన్(Finn Allen), టిమ్ సీఫర్ట్ (Tim Seifert)లను ఎంపిక చేశారు.
Newzealand Cricket : స్వదేశంలో భారత జట్టుతో వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ (Newzealand Cricket) విధ్వంసక ఓపెనర్లను స్క్వాడ్‌లోకి తీసుకుంది. పలువురు ఆటగాళ్లు గాయపడడంతో.. డేంజరస్ ఫిన్ అలెన్(Finn Allen), టిమ్ సీఫర్ట్ (Tim Seifert)లను ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఆదివారం ఉదయం మిచెల్ శాంట్నర్ సారథిగా 14 మందితో కూడిన పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకున్న చాప్మన్, రచిన్ రవీంద్రలకు చోటు దక్కింది.
టీమిండియా సవాల్‌కు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు స్క్వాడ్‌ను ప్రకటించింది. పలవురు ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్న వేళ తొలి మూడు వన్డేలకు.. చివరి రెండు వన్డేలకు కొన్ని మార్పులతో పటిష్టమైన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. ఐదు వన్డేల సిరీస్‌లో.. 4, 5వ మ్యాచ్‌లకు సీనియర్ బ్యాటర్ ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్లను తీసుకున్నారు.
మూడేళ్ల క్రితం అలెన్ చివరి వన్డే ఆడగా.. సీఫ్టర్ 18 నెలల తర్వాత స్క్వాడ్‌లోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించిన రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. డెవాన్ కాన్వే, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిఫ్స్తో మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ యూనిట్లో జాకబ్ డఫ్ఫీ, కైలీ జేమీసన్, మ్యాట్ హెన్రీ, బ్లెయిర్ టిక్నర్ ఉన్నారు. మూడేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై సెమీస్‌లో ఆడిన ఫెర్గూసన్ పేస్ దళంలో కీలకం కానున్నాడు.
New Zealand’s Test regulars will miss the last two games of the ODI series against India; Finn Allen, Lockie Ferguson and Tim Seifert have been named in the extended squad, while Rachin Ravindra will return after an injury layoff https://t.co/2e3LBP4kQG
— Cricinfo (@cricinfo) October 11, 2026
న్యూజిలాండ్ స్క్వాడ్(తొలి మూడు వన్డేలకు): మిచెల్ శాంట్నర్(కెప్టెన్), మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫ్ఫీ, మ్యాట్ హెన్రీ, కైలీ జేమీసన్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్.
న్యూజిలాండ్ స్క్వాడ్(4, 5 వన్డేలకు): మిచెల్ శాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, క్రిస్టియన్ క్లార్కేలాకీ ఫెర్గూసన్, మిచ్ హే(వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), విల్ యంగ్, జాకబ్ డఫ్ఫీ, మ్యాట్ ఫిషర్, బ్లెయిర్ టిక్నర్.
అక్టోబర్ మూడో వారంలో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు. అక్టోబర్ 22 నుంచి శ్రేయాస్ అయ్యర్ సేన, కివీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆపై నవంబర్ 4వ నుంచి ఇరుజట్లు ఐదు వన్డేల్లో తలపడతాయి. అనంతరం నవంబర్ 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టును టీమిండియా ఢీకొట్టనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

