Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ఎర్రుపాలెం, అక్టోబర్ 11: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్. ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ షేక్ ఫాతిమాభి పార్టీకి రాజీనామా చేశారు.
ఎర్రుపాలెం, అక్టోబర్ 11: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్. ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ షేక్ ఫాతిమాభి పార్టీకి రాజీనామా చేశారు. గ్రామాభివృద్ధి పనుల విషయంలో సొంత పార్టీ నాయకుల నుంచి సహకారం అందడం లేదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.
ప్రజాపాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సొంత ఇలాకాలోనే ఊహించని షాక్ తగిలింది. అభివృద్ధికి పార్టీ నాయకులు సహకరించడం లేదని ఎర్రుపాలెం మండలం కాచవరం కాంగ్రెస్ సర్పంచ్ రాజీనామా చేశారు. శనివారం రాత్రి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫాతిమాభి మాట్లాడుతూ.. తమ కుటుంబం గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేస్తోందని తెలిపారు. గతంలో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీని వీడకుండా కొనసాగామని ఆమె గుర్తు చేశారు.
‘ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలపడంతో నేను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యా. కానీ, సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు నాకు సహకరించడం లేదు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నించినప్పుడు పార్టీలోని మరో వర్గం నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు అని ఆమె వాపోయారు. అంతేకాదు అభివృద్ధి పనుల్లో పార్టీ నాయకులు సహకరించడం లేదనే విషయాన్ని పలుమార్లు మండల స్థాయి కాంగ్రెస్ నేతల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు’ అని ఫాతిమాభి ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ముందుకు సాగాలని తాను భావించినప్పటికీ, పార్టీ నాయకుల నుంచి సహకారం అందడం లేదని ఫాతిమాభి తెలిపారు. మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ఈ సమస్యను వివరించినా పరిష్కారం లభించలేదని ఆమె పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న తన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఫాతిమాభి ప్రకటించారు. తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ రాజీనామా ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

