హుజూరాబాద్ రూరల్, నవంబర్ 3 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన రైతు ఇమ్మడి సదానందం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. సదానందంకు 20 గుంటల పొలం ఉంది. ఇటీవల అప్పు చేసి ఇంటి పనులు మొదలు పెట్టుకున్నాడు. డబ్బులు లేక సగంలోనే ఆగిపోయింది.
పొలానికి సైతం అప్పు చేయడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పులు ఇచ్చిన వారు తిరిగి అడగటంతో కలత చెంది సోమవారం పురుగులమందు తాగాడు. స్థానికులు గమనించి 108 సహాయంతో హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.