న్యూఢిల్టీ : విమాన టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు చేయడానికి పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ సిద్ధమైంది. టికెట్ బుకింగ్ చేసుకున్న 48 గంటల్లో రద్దు చేసుకున్న వారికి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్పులు చేయబోతున్నది.
ట్రావెల్ ఏజెంట్ లేదా ఆయా సంస్థల పోర్టల్ ద్వారా విమాన టికెట్ల కొనుగోలు చేసిన రెండు రోజులలోపు వీటిని రద్దు చేసుకుంటే వారికి పూర్తి స్థాయిలో అమౌంట్‌ను రిటర్న్ చేయనున్నారు. ఈ రిఫండ్ ప్రాసెసింగ్‌ను 21 రోజులలోపు పూర్తి చేయాల్సి ఉంటుందని డీజీసీఏ సూచించింది.