పటాన్ చెరు, నవంబర్ 3: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha)ను ఆశీర్వదించి.. భారీ మెజార్టీతో గెలిపించాలని పటాన్ చెరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆదర్శ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పలు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగించడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రజలకు కొత్త పథకాల హామీ ఇచ్చి.. వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆదర్శ రెడ్డి విమర్శించారు.

ఉపఎన్నిక చాలా కీలకమైందని, ఈ ఎన్నిక ఫలితం మొత్తం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ నేత జిన్నారం వెంకటేష్ గౌడ్, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య, కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, జిన్నారం మైనార్టీ అధ్యక్షుడు ఖాదిర్, శ్రీకాంత్, నరేష్, ఇమ్రాన్, వెంకట్ రెడ్డి, సంపత్ గౌడ్, చిన్న, అల్తాఫ్, ఉమర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.