డెల్టా వేరియంట్‌పై జేజే వ్యాక్సిన్ సమర్థవంతం
డెల్టా వేరియంట్‌పై జేజే వ్యాక్సిన్ సమర్థవంతం | కొవిడ్ మహమ్మారి వణికిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ పంజా విసురుతోంది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తోంది.

వాషింగ్టన్ : కొవిడ్ మహమ్మారి వణికిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ పంజా విసురుతోంది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. డెల్టా వేరియంట్‌పై కంపెనీ తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపింది. జేజే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టాతో సహా అన్ని రకాల వేరియంట్లకు వ్యతిరేకంగా ఎనిమిది వరకు నెలల వరకు ప్రతిరోధకాలు ఉత్పత్తి అయ్యాయని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో తొలిసారిగా గుర్తించిన డెల్టా వేరియంట్.. పలుదేశాలకు విస్తరించింది. రాబోయే రోజుల్లో అమెరికాలో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేస్తోంది.
వైరస్ నుంచి దీర్ఘకాలికంగా రక్షణ అందించేందుకు బూస్టర్ షాట్లు అవసరమా? అనే విషయంపై నిపుణులు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా జేజే వ్యాక్సిన్ గ్లోబల్ హెడ్ జోహన్ వాన్ హూఫ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బూస్టర్ డోస్ అవసరం లేదని, జేజే వ్యాక్సిన్ డెల్టాతో సహా అన్ని వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. టీకా తీసుకున్న 29 రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను నిర్మూలించడంతో పాటు కాలక్రమేణా రక్షణ పెరిగిందని చెప్పారు. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీలను అంచనా వేసేందుకు చివరి దశ ట్రయల్స్‌లో ఎనిమిది మంది రక్త నమూనాలను కంపెనీ పరిశీలించింది. ప్రారంభ దశలో అధ్యయనంలో పాల్గొన్న 20 మంది రోగ నిరోధకత ప్రతి స్పందనను ఇజ్రాయెల్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాన్ బరూన్ విశ్లేషించారు.
ఆన్లైన్ రీసెర్చ్ బయోఆర్క్సివ్లో డేటాను ప్రచురించనున్నారు. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించిన బీటా వేరియంట్ కంటే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. జేజే వ్యాక్సిన్ రెండో మోతాదు తీసుకున్న వారిలో యాంటీబాడీలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని పేర్కొంది. ఆగస్టు చివరిలో రెండో డోస్ చివరి దశ ట్రయల్స్ ఫలితాల డేటాను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. మరో వైపు కంపెనీ టీ కణాలను సృష్టించే టీకా సామర్థ్యంపై సైతం అధ్యయనం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
వ్యాక్సినేషన్ @ 33.96కోట్లు
రాజేంద్రనగర్‌లో కారు బీభత్సం
ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్
దేశంలో కొత్తగా 46వేల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

