Jemimah Rodrigue | వన్డే ప్రపంచకప్‌లో తడబాటు నుంచి గొప్పగా పుంజుకొన్న భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విజయంతో మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించింది. దశాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు మైదానంలో సర్వశక్తులు ఒడ్డిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందం.. ఎట్టకేలకు వన్డే వరల్డ్ కప్‌ను (ICC Womens ODI World Cup) ముద్దాడింది. ఈ విజయంతో మహిళా క్రికెటర్ల క్రేజ్ అమాంతం పెరిగింది. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigue), స్మృతి మంధాన (Smriti Mandhana), హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మ సహా పలువురి సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్య రెట్టింపైంది.
అంతేకాదు, వారి బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగింది. మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్మెంట్ఫీజులు (Endorsement Fee) 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయి. కొత్త ఎండార్స్‌మెంట్లే కాకుండా.. పాత వాటిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఫీజులు 25 నుంచి 30 శాతం వరకూ పెరిగినట్లు సదరు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ వాల్యూ 100 శాతం పెరిగినట్లు సమాచారం. జెమీమా బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజుగా ఇప్పటి వరకూ రూ.75 లక్షల వరకూ తీసుకుంటుండగా.. దాని విలువ ఇప్పుడు రూ.1.5 కోట్లకు చేరింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం దాదాపు 10 నుంచి 12 బ్రాండ్లు తమను సంప్రదించినట్లు జేఎస్‌డబ్ల్యూ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ తెలిపారు.
ఇక దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇప్పటికే రెక్సోనా డియోడ్రెంట్, నైక్, హ్యుందయ్, హెర్బాలైఫ్, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ వంటి దాదాపు 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో బ్రాండ్‌కు ఆమె రూ.1.5-2 కోట్ల వరకూ సంపాదిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read..
World Cup Final | దశాబ్దాల కల సాకారం.. ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..!
BCCI | విజేతలకే కాదు.. సెలెక్టర్లకూ ప్రైజ్‌మనీలో వాటా..!