BCCI : మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతలైన భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. తొలిసారి ఛాంపియన్‌గా నిలిచినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూ.51 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని స్క్వాడ్‌లోని వాళ్లకు త్వరలోనే అందిస్తామని సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) వెల్లడించాడు. అయితే.. ప్రపంచ కప్ కోసం పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లుకు కూడా ప్రైజ్‌మనీలో వాటా ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. నీతూ డేవిడ్ (Neetu David) నేతృత్వంలోని సెలెక్టన్ కమిటీ సభ్యులను అభినందిస్తూ వారికి కొంత డబ్బు ముట్టజె ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
పదమూడో సీజన్ ప్రపంచ కప్ కోసం నీతూ డేవిడ్ సారథ్యంలోని సెలెక్టర్లు ప్రతిభావంతులకే పట్టం కట్టారు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో స్క్వాడ్‌ను సెప్టెంబర్ 4న ప్రకటించారు. వారు ఎంపిక చేసిన బృందంలోని సభ్యులతోనే హర్మన్‌ప్రీత్ కౌర్ వరల్డ్ కప్‌ను ఒడిసిపట్టింది. దాంతో.. టీమిండియా విజయంలో సెలెక్టర్ల పాత్ర కూడా పరోక్షంగా ఉంది.
🚨 NEWS 🚨
BCCI announces Cash Prize of INR 51 Crore for India’s victorious ICC Women’s Cricket World Cup 2025 contingent.
Details 🔽 #TeamIndia | #WomenInBlue | #CWC25 | #Champions https://t.co/EUXzv8PpXD
— BCCI (@BCCI) November 3, 2025
అందుకే ప్రతిభావంతులను వెలికితీసిన నీతూ డేవిడ్, రేణు మార్గరేట్, హారతి వైద్యా, కల్పన వెంకటాచార్, శ్యామా దే షా ప్యానెల్‌కు రూ.51 కోట్ల ప్రైజ్‌మనీలో వాటా ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. అయితే.. టీమిండియా ప్లేయర్లకు, సెలెక్టన్ ప్యానెల్ సభ్యులకు ఎంత మొత్తం చెల్లిస్తారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.