Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే మరో మాసివ్ ప్రాజెక్ట్‌గా నిలవనుందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే మూవీ ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘పెద్ది’ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తాజాగా ఫస్ట్ సింగిల్‌పై హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో “ఏం ప్లాన్ చేస్తున్నారు?” అంటూ రెహమాన్, బుచ్చిబాబు, మోహిత్ చౌహాన్ ఉన్న ఫోటోను షేర్ చేశారు.
దానికి స్పందించిన రెహమాన్ సరదాగా “చికిరి చికిరి… చరణ్ గారు!” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగింది. ఫస్ట్ సింగిల్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే విడుదల చేయనున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ ‘SSMB29’ టీమ్ కూడా ఇలాగే సోషల్ మీడియాలో సరదాగా చాట్ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా హంగామా సృష్టిస్తోంది.పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇటీవల శ్రీలంకలో కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. చరణ్ – జాన్వీ జంటపై ఒక లవ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించినట్లు టాక్.
ఫ్యాన్స్ అంచనాల ప్రకారం, ఈ పాటను ఈ నెల 8న హైదరాబాద్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్లో విడుదల చేసే అవకాశం ఉంది. గ్లింప్స్‌లోనే “పెద్ది… పెద్ది… పెద్ది…” అంటూ రెహమాన్ మ్యూజిక్ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన చెప్పిన “చికిరి చికిరి” లైన్ ఆ ఫస్ట్ సింగిల్‌లో కీలక భాగమని అభిమానులు ఊహిస్తున్నారు. ఇటీవల మేకర్స్ హీరోయిన్ పాత్రను రివీల్ చేశారు. జాన్వీ సినిమాలో ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇది జానపద గాయని పాత్రగా, గ్రామీణ నేపథ్యంతో కూడిన మాసీ రోల్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ లుక్స్‌తోనే కనిపించిన జాన్వీకి ఇది కెరీర్లో కొత్త మలుపుగా మారవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ను 2026 మార్చి 27న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం.
‘Chikiri Chikiri’ Charan garu 😃 https://t.co/fmfwYSJFU8
— A.R.Rahman (@arrahman) November 3, 2025