న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం మరిన్ని చిక్కులు ఎదుర్కొనబోతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఈడీ ప్రాసిక్యూషన్ అనుమతి ఉత్తర్వును కోర్టులో దాఖలు చేసింది.
దీంతో పీఎంఎల్ఏ చట్టం కింద నమోదైన ఆరోపణలకు సంబంధించి ఈడీ ఆయన్ని విచారించనున్నది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ 2017లో కేసు నమోదుచేయగా, ఆ తర్వాత ఈడీ పీఎంఎల్ఏ కేసు నమోదుచేసింది. దీంట్లో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నిందితులుగా ఉన్నారు.