Jemimah Rodrigue | వన్డే ప్రపంచకప్ విజయంతో పెరిగిన మహిళా క్రికెటర్ల క్రేజ్.. 100% పెరిగిన జెమీమా బ్రాండ్ వాల్యూ
Jemimah Rodrigue | వన్డే ప్రపంచకప్ విజయంతో మహిళా క్రికెటర్ల క్రేజ్ అమాంతం పెరిగింది. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigue), స్మృతి మంధాన (Smriti Mandhana), హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మ సహా పలువురి సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్య రెట్టింపైంది.
Jemimah Rodrigue | వన్డే ప్రపంచకప్‌లో తడబాటు నుంచి గొప్పగా పుంజుకొన్న భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే విజయంతో మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించింది. దశాబ్దాల కలను సాకారం చేసుకునేందుకు మైదానంలో సర్వశక్తులు ఒడ్డిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందం.. ఎట్టకేలకు వన్డే వరల్డ్ కప్‌ను (ICC Womens ODI World Cup) ముద్దాడింది. ఈ విజయంతో మహిళా క్రికెటర్ల క్రేజ్ అమాంతం పెరిగింది. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigue), స్మృతి మంధాన (Smriti Mandhana), హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మ సహా పలువురి సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్ల సంఖ్య రెట్టింపైంది.
అంతేకాదు, వారి బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగింది. మహిళా క్రికెటర్ల బ్రాండ్ ఎండార్స్మెంట్ఫీజులు (Endorsement Fee) 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగాయి. కొత్త ఎండార్స్‌మెంట్లే కాకుండా.. పాత వాటిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఫీజులు 25 నుంచి 30 శాతం వరకూ పెరిగినట్లు సదరు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ వాల్యూ 100 శాతం పెరిగినట్లు సమాచారం. జెమీమా బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజుగా ఇప్పటి వరకూ రూ.75 లక్షల వరకూ తీసుకుంటుండగా.. దాని విలువ ఇప్పుడు రూ.1.5 కోట్లకు చేరింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం దాదాపు 10 నుంచి 12 బ్రాండ్లు తమను సంప్రదించినట్లు జేఎస్‌డబ్ల్యూ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ తెలిపారు.
ఇక దేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఇప్పటికే రెక్సోనా డియోడ్రెంట్, నైక్, హ్యుందయ్, హెర్బాలైఫ్, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ వంటి దాదాపు 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో బ్రాండ్‌కు ఆమె రూ.1.5-2 కోట్ల వరకూ సంపాదిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read..
World Cup Final | దశాబ్దాల కల సాకారం.. ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..!
BCCI | విజేతలకే కాదు.. సెలెక్టర్లకూ ప్రైజ్‌మనీలో వాటా..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

