World Cup Final : భారత మహిళల జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్(ODI World Cup)ను ఒడిసిపట్టేసింది. రెండుసార్లు ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని దిగమింగిన భారత జట్టు మూడో ప్రయత్నంలో జగజ్జేతగా అవతరించింది. ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసి.. వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ఛాంపియన్‌గా ఆవిర్భవించిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన ఆనందానికి అవధుల్లేవు. లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev), ఎంఎస్ ధోనీ(MS Dhoni) తర్వాత భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్‌గా చరిత్ర లిఖిచింది హర్మన్‌ప్రీత్.
భారత మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. 2005, 2017లో మిథాలీ రాజ్ బృందం చేజారిన ప్రపంచకప్‌ను సొంతగడ్డపై పట్టేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. డీవై పాటిల్ మైదానంలో ఓపెనర్ షఫాలీ వర్మ(87 : 2-36), దీప్తి శర్మ(58 : 5-39)లు ఆల్‌రౌండ్ షోతో భారత్ మొట్టమొదటిసారి ఛాంపియన్‌గా అవతరించగా.. తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా కప్ కల చెదిరింది. బ్యాట్‌తో, బంతితో సఫారీలను దెబ్బతీసిన షఫాలీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women’s Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/rYIFjasxmc
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
భారత్ నిర్దేశించిన రికార్డు లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో గొప్పగా ఆడి దీటుగా బదులిచ్చేలా కనిపించింది. ఓపెనర్లు తంజిమ్ బ్రిట్స్(23), లారా వొల్వార్డ్త్(101)లు తొలి వికెట్‌కు 51 రన్స్ జోడించారు. అయితే.. అమన్‌జోత్ కౌర్ మెరుపు త్రోతో బ్రిట్స్ రనౌట్ అయింది. ఆ కాసేపటికే అనెకే బాష్‌ను శ్రీచరణి ఎల్బీగా వెనక్కి పంపింది. ఆ తర్వాత సునే లుస్ (25), లారా కీలక భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగించారు.
FRAME IT! 🖼️
The moment #TeamIndia won the ICC Women’s Cricket World Cup 2025 🥹
Scorecard ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA | @ImHarmanpreet pic.twitter.com/bCXjKIcI9R
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
ఈ జోడీని విడదీసేందుకు బంతిని పార్ట్ టైమ్ స్పిన్నర్ షఫాలీకి అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫలితం రాబట్టింది. లుస్ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపిన షఫాలీ.. ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ మరిజానే కాప్(4)ను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. లెగ్ సైడ్ పడిన బంతిని మరిజానే లెగ్ సైడ్ ఆడాలనుకుంది. కానీ, వికెట్ కీపర్ రీచా సూపర్ క్యాచ్ అందుకోవడంతో సఫారీల నాలుగో వికెట్ పడింది. జఫ్తాను ఔట్ చేసిన దీప్తి ఐదో వికెట్ అందించింది. అయితే.. రాధా యదవ్ వేసిన ఓవర్లో నో బాల్‌కు డెర్క్సెన్ (35) రెండు సిక్సర్లు బాదగా.. 13 రన్స్ వచ్చాయి.
𝙁𝙄𝙁𝙀𝙍⚡️
Deepti Sharma with a perfect 🖐️ on the night of the final 🙇♀️
Another exceptional performance from the #TeamIndia all-rounder 🔥
Scorecard ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA | @Deepti_Sharma06 pic.twitter.com/pv4aZ3eGJF
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
సగం వికెట్లు పడినా కూడా కెప్టెన్ లారాకు తోడుగా డెర్క్సన్ దంచేస్తుండగా సఫారీలకు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ డెర్క్సన్నుబౌల్డ్ చేసిన దీప్తి.. సెంచరీ బాదిన లారాను వెనక్కి పంపి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పింది. అదే ఊపులో ట్రయాన్(9)ను ఎల్బీగా ఔట్ చేసిన దీప్తి ఐదో వికెట్ ఖాతాలో వేసుకుంది. ఖాక రనౌట్ కాగా .. డేంజరస్ డీక్లెర్క్(18) క్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ అద్బుతంగా అందుకుంది. దాంతో. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియగా.. మూడోసారి ఫైనల్లో విజేతగా అవతరించింది టీమిండియా.
వర్షం అంతరాయం కారణంగా గంటన్నర టాస్ ఆలస్యమైన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్లు సెంచరీ భాగస్వా్మ్యంతో శుభారంభం ఇచ్చినా మిడిలార్డర్ వైఫల్యంతో 300 మార్క్ అందుకోలేకపోయింది. చివరి పది ఓవర్లో 69 రన్స్ మాత్రమే రావడంతో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగలిగింది.