నాదౌన్: రంజీ ట్రోఫీలో బోణీ కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఎదుట హిమాచల్‌ప్రదేశ్ 344 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 303 రన్స్‌కు ఆలౌట్ అయింది. వశిష్ట్ (101) మరోసారి సెంచరీతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 8 రన్స్ చేసింది.
నారాయణన్ ముందంజ 
పనాజీ: గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత ఆటగాడు ఎస్ఎల్ నారాయణన్ రౌండ్ ఆఫ్ 128కి అర్హత సాధించాడు. సోమవారం ముగిసిన తొలి సెట్ టైబ్రేక్ గేమ్స్‌లో నల్లపావులతో ఆడిన ఈ కోల్‌కతా గ్రాండ్ మాస్టర్.. 22 ఎత్తుల్లోనే స్టీవెన్ రోజస్ను చిత్తుచేశాడు. ప్రపంచకప్ విజేత దివ్య తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.