Talasani srinivas yadav | సికింద్రాబాద్‌కు ఓ చరిత్ర ఉంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఈ విషయమై తలసాని మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీన లీ ప్యాలెస్‌లో అన్ని వర్గాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీరోడ్ లోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజీ, మహబూబ్ కాలేజ్. చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు.. అంటే ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్- ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం.. అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరించబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నట్వంటి సికింద్రాబాద్ పేరు మార్చి మూడు కార్పోరేషన్లుగా.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి చేయడమంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేసే ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ల ఒప్పందం ప్రకారం 1809లో సికింద్రాబాద్ ఏర్పడింది.
ఎప్పుడు చూసినా నార్త్ జోన్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతమంతా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అన్ని మతాలు కలిసి సమానంగా చూడబడే సికింద్రాబాద్ ప్రాంతాన్ని రాచరిక పాలన కొనసాగిస్తా.. ఏదో నా రాజ్యం ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అనుకోవడం సాగవని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే విషయాన్ని మరిచి రాచరిక పాలన సాగిస్తామంటే ఊరుకునేది లేదని తలసాని హెచ్చరించారు. గ్రామం నుండి క్రమక్రమంగా విస్తరించిన ప్రాంతం మల్కాజిగిరి.
సికింద్రాబాద్‌కు ఎంతో గణ చరిత్ర ఉంది. డివిజన్ల విభజన కూడా అంతా గందరగోళంగా చేశారు. ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా కార్యాలయాలలో కూర్చొని మ్యాప్‌ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందన్నారు.
Tirupati Express | తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్‌కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు