జెరూసలెంలో తెరుచుకున్న మౌంట్ హోలీ టెంపుల్
ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు

జెరూసలేం : ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఆదివారం వరుసగా మూడవ రోజు కూడా కొనసాగింది. తమ పవిత్ర స్థలం యూదులకు తెరిచిన మొదటి రోజున ఎలాంటి అవాంతరాలు లేవని, ప్రశాంతంగా యాత్ర కొనసాగిందని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా సంస్థ మధ్య 11 రోజుల యుద్ధం తర్వాత గాజా స్ట్రిప్‌లో ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది. అంతకుముందు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణను పూర్తిగా పాటించాలని పిలుపునిచ్చింది. భద్రతా మండలిలోని మొత్తం 15 మంది సభ్యుల తరఫున శనివారం ఒక ప్రకటనలో ‘హింస ఫలితంగా పౌరుల ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం ప్రకటించారు. పాలస్తీనా పౌర జనాభాకు, ముఖ్యంగా గాజాలో మానవీయ సహాయం అవసరం అని ఐరాస నొక్కి చెప్పింది.
ముస్లింలు కూడా ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇజ్రాయెల్ పోలీసులు-పాలస్తీనియన్ల మధ్య హింసాత్మక ఘర్షణలు యుద్ధ రూపాన్ని తీసుకున్న ఈ ప్రాంతంలో అల్-అక్సా మసీదు కూడా ఉన్నది. ఈ మసీదులో హింసాకాండ తర్వాత యూదుల తీర్థయాత్ర మొదటిసారిగా ప్రారంభమైంది. యూదులు కూడా ఈ స్థలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. 1967 లో యుద్ధం అనంతరం ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది.
ఇవి కూడా చదవండి..
ఖలీస్తాన్ టైగర్ ఫోర్స్‌తో సంబంధమున్న ఇద్దరు అరెస్ట్
అమెరికాలో మరో నల్లజాతీయుడి మరణంపై వివాదం.. తాజాగా వీడియో బయటకు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
ఎక్కువ జిగురు కోసం చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు..
నిన్న ఎయిర్ ఇండియా.. ఇవ్వాళ డొమినోజ్ డాటా లీక్..!
సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
టిబెట్‌ను ఆక్రమించిన చైనా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

