Aircrafts Windshield Cracks | ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. మధురై (Madurai) నుంచి చెన్నై వచ్చిన విమానం ల్యాండింగ్‌కు ముందు విండ్ షీల్డ్‌కు పగుళ్లు (Aircrafts Windshield Cracks) వచ్చాయి. గమనించిన పైలట్ ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం విమానం చెన్నై ఎయిర్పోర్ట్ (Chennai Airport)లో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ఇండిగోకు చెందిన విమానం 76 మంది ప్రయాణికులతో మధురై నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే, మరికాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుందనంగా విండ్ షీల్డ్‌కు పగుళ్లు కనిపించాయి. అప్రమత్తమైన పైలట్ ఈ విషయంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయంలో తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని పార్కింగ్ కోసం ప్రత్యేక బేకు తరలించినట్లు చెప్పారు. అక్కడ ప్రయాణికులను సురక్షితంగా దింపేసినట్లు వివరించారు. విండ్‌షీల్డ్‌ను మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తాజా ఘటనతో విమానం మధురైకి తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు.
Also Read..
Suicide Attack | పోలీసు శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి
Donald Trump | ఆ బహుమతి నాకు ఇచ్చేయమని అడగలేదు.. నోబెల్ శాంతి దక్కకపోవడంపై ట్రంప్ స్పందన