Ducks | పెర్త్ (Perth)లో ఆసక్తికర సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఓ రద్దీ రోడ్డును బాతుల గుంపు (Ducks) క్రాస్ చేస్తుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ (Heavy Traffic) ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
DUCKS ON FREEWAY – KWINANA FREEWAY NORTHBOUND AT CANNING HIGHWAY, COMO
Multiple lanes affected
Motorist out of vehicles
Motorists be aware and be alert
Traffic heavy back to Leach Highwayhttps://t.co/9PVfGLIBPN#perthtraffic #mainroadswa pic.twitter.com/A3RrRNI3FB— Main Roads WA (@Perth_Traffic) October 10, 2025
కోమోలోని కానింగ్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రహదారిపై వాహనాలు అధిక స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఇంతలో ఓ బాతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. ఇది గమనించిన కొందరు వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేశారు. దీంతో ఆ బాతుల గుంపు ఎంచక్కా ఒకదాని వెనుక నడుస్తూ రోడ్డు దాటేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కాగా, వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో పలు కార్లు ఢీ కొన్నాయి (Multi Car Crash). ఈ ఘటనలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాహనదారుల ప్రవర్తించిన తీరును పశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
DUCKS ON FREEWAY – KWINANA FREEWAY NORTHBOUND AT CANNING HIGHWAY, COMO
Various intermittent lane closures in place
Motorists out of vehicles
Traffic heavy back to Leach Highwayhttps://t.co/8KWlWgl0dW #perthtraffic pic.twitter.com/pFTqgWD3pZ— Main Roads WA (@Perth_Traffic) October 9, 2025
Also Read..
Earthquake | మయన్మార్‌ను మరోసారి వణికించిన భారీ భూకంపం.. వారం రోజుల్లో నాలుగోసారి
Strikes in Afghanistan | ఆఫ్ఘాన్ మంత్రి భారత్ పర్యటన వేళ.. కాబూల్‌పై పాక్ వైమానిక దాడులు