Strikes in Afghanistan | తాలిబన్ పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌పై దాయాది పాకిస్థాన్ మెరుపు దాడులు (Strikes in Afghanistan) చేసినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ (Kabul)లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ ముఫ్తీ నూర్ మెహ్సూద్ మరణించి ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. కాబూల్‌లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ శిబిరాలే లక్ష్యంగా పాక్ జెట్లు వైమానికి (Pakistani jets) దాడులు చేశాయి. టీటీపీ చీఫ్ నూర్ మెహ్సూద్‌ను హతమార్చడమే లక్ష్యంగా షాహిద్ అబ్దుల్ హక్ స్క్వేర్ సమీపంలో వైమానిక దాడి జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, పాక్ వైమానిక దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని నివేదికలు తెలిపాయి. పౌర నిర్మాణాలు దెబ్బతిన్నట్లు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగమంత్రి (Taliban minister) ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కాబూల్‌పై పాక్ దాడులు చేయడం గమనార్హం.
Also Read..
Earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. వీడియో
Nobel Peace Prize | నేడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు దక్కేనా?