Suicide Attack | దాయాది పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోని ఓ పోలీసు శిక్షణా కేంద్రం (Police Training Centre)పై ఆత్మాహుతి దాడికి (Suicide Attack) పాల్పడింది. ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మరణించారు. దాడి అనంతరం అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు టెర్రరిస్ట్లు (Terrorists) హతమయ్యారు.
డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని రట్టా కులాచి పోలీసు శిక్షణా పాఠశాలపై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలు నిండిన ట్రక్కు శిక్షణ పాఠశాల ప్రధాన ద్వారాన్ని ఢీ కొట్టింది. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి ప్రతీకారంగా పోలీసులు ఆ ప్రాంతంలో కాల్పులు జరిపారు. ఈ ప్రతీకార కాల్పుల్లో తొలుత ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఆ ప్రాంతంలో మరింతమంది ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న అనుమానంతో దాదాపు 5 గంటల పాటూ భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఇక ఈ ఘటనలో 13 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు శిక్షణా కేంద్రంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read..
P Chidambaram: పురుష జర్నలిస్టులు వాకౌట్ చేయాల్సింది: చిదంబరం
IPS Officer: పోస్టుమార్టంపై తొందరెందుకు? ఆవేదన వ్యక్తం చేసిన ఐపీఎస్ ఆఫీసర్ భార్య