Nobel Peace Prize | ప్రస్తుతం ఎవరి నోట విన్నా నోబెల్ శాంతి బహుమతి గురించే చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ నోబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Prize) ఈ ఏడాది వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోను (Maria Corina Machado) వరించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆశలపై నీళ్లు చల్లుతూ 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కొరీనా మచాడోకు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) నేత పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరియా కొరీనా తమ దేశంలో రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ఇచ్చారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ తెలిపారు. అమెలానే ఇప్పుడు మన దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోరాడుతున్నారని పేర్కొన్నారు. ‘రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినందుకు వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలికి ఈ ఏడాది నోబెల్ శాంతి లభించింది. భారత్‌లో రాజ్యాంగాన్ని కాపాడే పోరాటానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ఆయనకు కూడా శాంతి పురస్కారం ఇవ్వాలని పరోక్షంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు కొరీనా మచాడో, రాహుల్ ఉన్న ఫొటోలను ట్వీట్‌కు జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
इस बार का नोबल शांति पुरस्कार वेनेजुएला की विपक्ष की नेता को मिला है संविधान की रक्षा करने के लिये।
हिंदुस्तान 🇮🇳 के विपक्ष के नेता श्री राहुल गांधी देश के संविधान को बचाने की लड़ाई लड रहे है । pic.twitter.com/xcgfkJixlZ— Surendra Rajput (@ssrajputINC) October 10, 2025
Also Read..
Donald Trump | ఆ బహుమతి నాకు ఇచ్చేయమని అడగలేదు.. నోబెల్ శాంతి దక్కకపోవడంపై ట్రంప్ స్పందన
Trump Tariffs | చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. ప్రకటించిన ట్రంప్
Explosion | మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి!