Doctor Supended : ప్రాణాలు నిలిపే మందులను ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేసి.. అంతే భద్రంగా సరఫరా చేస్తారు. కానీ, తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం మెడిసిన్స్‌ను ఒక చెత్త బండి (Dust Bin Truck)లో తరలించారు. ఉత్తర చెన్నైలోని ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి మందులను చెత్తను తీసుకెళ్లారు. ముతమిజ్ నగర్ నుంచి 1.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొడుంగైయుర్లోని హెల్త్ సెంటర్‌కు డస్ట్ బిన్ ట్రక్కులోనే మందులను తరలించడం అధికారుల దృష్టికి వచ్చింది. ఆరోగ్య కేంద్రంలోని కాంట్రాక్ట్ మహిళా డాక్టర్ ఇందుకు బాధ్యులని గుర్తించిన చెన్నై నగరపాలిక సంస్థ ఆమెను సస్పెండ్ చేసింది.
చెత్త బండిలో మెడిసిన్స్ తరలింపుతో సంబంధమున్న వైద్యురాలిని సస్పెండ్ చేశాం. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. ఉద్దేశపూర్వకంగానే మందులను చెత్త బండిలో తీసుకెళ్లారా? మరేదైనా కారణం ఉందా? అనేది విచారణలో తెలుస్తుంది అని ఎన్డీటీవీతో కార్పోరేషన్‌లోని సీనియర్ అధికారి వెల్లడించారు.
ఈ విషయంపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై తీవ్రంగా స్పందించారు. ప్రాణాల్ని నిలిపే మందులను, గర్భిణులు, పసిపిల్లలకు అందించే మెడిసిన్స్‌ను ఏమాత్రం బాధ్యత లేకుండా చెత్త బండిలో తీసుకెళ్లడం దారణం. ప్రజారోగ్యంపై డీఎంకే ప్రభుత్వానికి శ్రద్ధ లేదనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అని అన్నామలై ప్రభుత్వాన్ని విమర్శించారు.
The disgraceful act of carrying life-saving medicines meant for pregnant women & children in a garbage truck to an urban primary health centre in Chennai’s Kodungaiyur speaks volumes about the patchwork model DMK govt’s utter disregard for the well-being of the people of TN.… pic.twitter.com/RcjwrTt1Ld
— K.Annamalai (@annamalai_k) October 9, 2025
ఆరోగ్య కేంద్రానికి మందులు తీసుకెళ్లడానికి సరిపోను డబ్బులు లేనందును ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్థానిక వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సాయం కోరారు. దాంతో.. వాళ్లు ఒక చెత్త బండిని ఇచ్చారు. అయితే.. ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాల్సిన మందులను తమ బండిలో తరలిస్తారనే విషయం వేస్ట్ మేనేజ్మెంట్ శాఖ వాళ్లకు తెలియదు. ఆ బండిలోనే పలుమార్లు మెడిసిన్స్ చేరవేసినట్టు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన చెన్నై మహానగరపాలిక సంస్థ ఆ ఆరోగ్య కేంద్రంలోని కాంట్రాకట్ వైద్యురాలిని సస్పెండ్ చేసింది.