Leopard | తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత సంచరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పలువురు విద్యార్థులు కూడా చిరుత సంచరించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. చిరుత సంచారంతో విద్యార్థులు, సిబ్బంది హడలిపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఎస్వీ యూనివర్సిటీ వద్దకు చేరుకుంది. విద్యార్థులు, సిబ్బంది బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలోనూ యూనివర్సిటీలో చిరుత సంచరించి అందర్నీ భయాందోళనకు గురి చేసింది. అప్పుడు ఏడీ బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ చిరుత సంచారంతో విద్యార్థులు, సిబ్బంది వణికిపోతున్నారు.
తిరుపతి ఎస్వీ యూనివర్శిటిలో చిరుత పులి కలకలం
రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలోకి వచ్చిన చిరుత
విద్యార్థులు, సిబ్బంది బయటకు రావద్దని అధికారుల హెచ్చరిక pic.twitter.com/Ud79HSEHyb
— Telugu Scribe (@TeluguScribe) October 11, 2025