Forex Reserves | భారత్ ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గాయి. ఈ నెల 19తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.83 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు ఈ నెల 12తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 5.4 బిలియన్ డాలర్లు తగ్గి 643.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 3.79 బిలియన్ డాలర్లు పతనంతో 560.86 బిలియన్ డాలర్లకు చేరాయి.
బంగారం రిజర్వు నిల్వలు 1.01 బిలియన్ డాలర్లు తగ్గి 56.81 బిలియన్ డాలర్లకు పడిపోతే, ఎస్‌డీఆర్‌లు 43 మిలియన్ డాలర్లు తగ్గి 18.03 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 2 మిలియన్ల డాలర్లు పతనమై 4.63 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నెలలోనే ఫారెక్స్ రిజర్వు నిల్వలు 645.6 బిలియన్ డాలర్ల జీవిత కాల గరిష్ట స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే.