Gujarat student Marks | గుజరాత్ విద్యార్థికి 200కుగాను 212, 211 మార్కులు.. రిజల్ట్ షీట్ చూసి అంతా షాక్
Gujarat student Marks | ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారులు దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు.
అహ్మదాబాద్: ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారులు దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. (Gujarat student Marks) గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖరసనా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థిని వంశీబెన్ మనీష్భాయ్కు పరీక్షల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు సబ్జెక్టులలో 200 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. గుజరాతీ పరీక్షలో 200కుగాను 211, గణితంలో 200కుగాను 212 మార్కులు సాధించినట్లు రిజల్ట్ షీట్లో పేర్కొన్నారు.
కాగా, పరీక్షల్లో తనకు వచ్చిన ఈ మార్కులు చూసి విద్యార్థిని వంశీబెన్ ఆశ్చర్యపోయింది. ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను తన పెరేంట్స్కు చూపించింది. దీంతో ఈ మార్కులు చూసి వారు కూడా షాక్ అయ్యారు. ఈ మార్కుల షీట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గుజరాత్‌లోని విద్యా వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు దీనిపై స్పందించారు. ఆ మార్కులను సవరించారు. గుజరాతీ పరీక్షలో 200కుగాను 191గా, గణితంలో 200కుగాను 190 మార్కులుగా మార్పు చేశారు. ఈ మేరకు కొత్త ప్రొగ్రెస్ రిపోర్ట్ జారీ చేశారు. తొలుత జరిగిన పొరపాటుపై దర్యాప్తునకు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

