Asia Cup trophy | ఆసియా కప్ ఫైనల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లేయర్ల కరచాలనంతో రచ్చ చెలరేగగా, తాజాగా ట్రోఫీ ప్రదాన కార్యక్రమం మరింత నిప్పు రాజేసింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. ట్రోఫీ (Asia Cup trophy)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB chief) మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది (India refuse Asia Cup trophy).
మోసిన్ నఖ్వి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఆనవాయితీగా ఆసియా కప్ ట్రోఫీని విజేతకు అందజేయాలని అనుకున్నారు. అయితే, అందుకు భారత్ నిరాకరించింది. ఖాళీ చేతులతోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫొటోలకు ఫోజులిచ్చిన అనంతరం టీమ్ఇండియా జట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక బహుమతి ప్రదానోత్సవంలో తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’, కుల్దీప్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డులను వేరే అతిథుల నుంచి తీసుకున్నారు.
India lift the Asia Cup Trophy in Dubai even though Pakistan Interior Minister Mohsin Naqvi cowardly stole it. Epic trolling of Pakistan by the Indian Cricket Team. pic.twitter.com/H0udtGSenP
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025
ఆసియాకప్‌లో భారత్ విజయదుందుభి మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను పాతరేస్తూ ఫైనల్లో అదరగొట్టింది. టోర్నీలో ముచ్చటగా మూడోసారి దాయాదిని మట్టికరిపించిన టీమ్ ఇండియా దుబాయ్ నడిగడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. పహల్గాం ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో భారత్ తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతూ పాక్‌ను ఓడించిన టీమ్ఇండియా…రికార్డు స్థాయిలో తొమ్మిదో సారి ఆసియాకప్‌ను సగర్వంగా ముద్దాడింది. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగిన టీమ్ఇండియా.. ఆదివారం చిరకాల ప్రత్యరితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో ఆ జట్టును 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల ఛేదనను భారత్ 19.3 ఓవర్లలో పూర్తిచేసింది.
Also Read..
ఆపరేషన్ తిలక్.. ఫైనల్లో పాక్‌పై భారత్ ఉత్కంఠ విజయం
Asia Cup Final | తిలక్ అజేయ అర్ధ శతకం.. తొమ్మిదోసారి ఆసియా కప్ విజేతగా భారత్
PM Modi | యుద్ధ భూమిలోనూ.. మైదానంలో ఫలితం ఒక్కటే: ప్రధాని మోదీ