బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని (Basara) శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా, బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ స్నానాలకు అధికారులు అనుమతించడం లేదు.
మూల నక్షత్రం పురస్కరించుకుని మెదక్ జిల్లా వర్గల్‌లోని సరస్వతి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు.