INDW vs ENGW : భారీ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. పేసర్ లారెన్ బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి షాట్‌కు యత్నించింది. కానీ, బంతి బ్యాట్ చివర తాకుతూ వెళ్లగా.. వికెట్ కీపర్ అమీ జోన్స్ చక్కని క్యాంచ్ అందుకుంది. దాంతో.. ౧13 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్మృతి మంధాన (5), హర్లీన్ డియోల్(2) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు స్కోర్. 16/1. ఇంకా భారత జట్టు విజయానికి 273 రన్స్ కావాలి.
Lauren Bell draws first blood for England Women, Pratika Rawal goes for just 6⃣
📸: JioHotstar#CWC25 #INDWvsENGW #LaurenBell #PratikaRawal #CricketTwitter pic.twitter.com/ND2XxKvihx
— InsideSport (@InsideSportIND) October 19, 2025
సెమీఫైనల్ రేసులో వెనకబడిన భారత జట్టు ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు శుభారంభమివ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు దంచేసి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. హీథర్ నైట్ (109) సెంచరీతో చెలరేగగా ఇంగ్లండ్ అలవోకగా 300 కొడుతుందనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో పుంజుకున్న దీప్తి శర్మ (4-51), శ్రీచరణి(2-68) .. వరుసగా వికెట్లు తీశారు. వీరిద్దరి విజృంభణతో టెయిలెండర్లు చకచకా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.