ఆమనగల్లు, (మాడ్గుల్) ఆక్టోబర్ 19 : రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండల పరిధిలోని నాగిళ్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సురమల్ల సత్తయ్య తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్‌ల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి ఇంచార్జీ ,మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు, 420 హమీలను ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు దన్నుకుని అధికారంలోకి వచ్చిందన్నారు.
అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్న ఇచ్చిన హమీలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారాని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు పగడాల రవితేజ, మాజీ సర్పంచ్ బండ నర్సింహ్మ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, నాయకులు చలమంద, మహేష్, రాములు, వరుణ్, చెన్నయ్య, మహేష్, యాదయ్య, శ్రీను బీఆర్ఎస్ నాయకులున్నారు.