Black Gold | భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్. ఈ భామ తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. యోగేశ్ కేఎంసీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంయుక్తామీనన్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం.. షూటింగ్ కొనసాగుతోంది. కాగా ఈ మూవీ టైటిల్ను లాక్ చేశారు మేకర్స్.
ఈ చిత్రానికి బ్లాక్ గోల్డ్ టైటిల్ను ఫిక్స్ చేసినట్టు తెలియజేస్తూ లుక్ ఒకటి విడుదల చేశారు. బొగ్గు షేడ్స్ బ్యాక్ డ్రాప్లో రాళ్లతో డిజైన్ చేసినట్టుగా ఉన్న టైటిల్ లుక్ మధ్యలో నాట్యం చేస్తున్న ప్రతిమ ఒకటి చూడొచ్చు. మొత్తానికి ఈ సినిమా నల్లబంగారం (బొగ్గు)చుట్టూ తిరుగుతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చినట్టు టైటిల్ లుక్ చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ను రేపు దీపావళి సందర్భంగా లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. సంయుక్తామీనన్ పవర్ ఫుల్ కమాండింగ్ రోల్లో కనిపించనున్నట్టు టైటిల్ లుక్ చెబుతోంది. ఈ మూవీని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏ వసంత్ సినిమాటోగ్రఫర్, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్.