INDW vs ENGW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసులో ఉన్న భారత్, ఇంగ్లండ్ ఇండోర్‌లో తలపడుతున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 44 రన్స్ చేసిన ఇంగ్లిష్ టీమ్.. అమీ జోన్స్(56) సెంచరీతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. అయితే.. దీప్తి శర్మ (౦)రెండు వికెట్లు తీసి బ్రేకిచ్చింది. ప్రస్తుతం హీథర్ నైట్ (52), నాట్ సీవర్ బ్రంట్(25)లు క్రీజులో ఉన్నారు. 33 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్. 165-2. మరో 17 ఓవర్లు ఉండంతో పాటు చేతిలో 8 వికెట్లు ఉండడంతో 250 -280 కొట్టేలా ఉంది ఇంగ్లండ్.
ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. అయితే.. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(22), అమీ జోన్స్ (56) అదిరే ఆరంభమిచ్చారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ ద్వయం నిదానంగా ఆడుతూ పవర్ ప్లేలో 44 రన్స్ రాబట్టింది. ఓవర్‌కు 5లోపు రన్‌రేటుతో సాగినప్పటికీ ఆ తర్వాత ఇద్దరూ బ్యాట్ ఝులిపించారు.
Deepti Sharma is at it again ☝️
Vice-captain Smriti Mandhana with a fine catch 🫴
#TeamIndia have their 2⃣nd wicket!Updates ▶ https://t.co/jaq4eHbeV4#WomenInBlue | #CWC25 | #INDvENG | @Deepti_Sharma06 | @mandhana_smriti pic.twitter.com/WTwERfYjuy
— BCCI Women (@BCCIWomen) October 19, 2025
అయితే.. ప్రమాదకరమైన ఈ ద్వయాన్ని విడదీసింది దీప్తి శర్మ. డేంజరస్ బ్యూమంట్ను బౌల్డ్ చేసి తొలి వికెట్ 73 పరుగుల భాగస్వా్మ్యానికి తెరపడింది. వికెట్ పడిన జోరు తగ్గించని జోన్స్ అర్ధ శతకం పూర్తి చేసింది. కానీ, కాసేపటికే ఆమె దీప్తి ఓవర్లో స్మృతి మంధాన చేతికి చిక్కింది. ప్రస్తుతం.. హీథర్ నైట్(52), నాట్ సీవర్ బ్రంట్(25)లు జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నారు.