విజయవాడ : పోలీసులు కార్డన్‌సెర్చ్ చేస్తుండగా దుండగుడు పోలీసులపైకి కాల్పులకు యత్నించిన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా.. దుండగుడు పోలీసులు, ఈగల్ టీమ్ అధికారులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.
అనంతరం పారిపోతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందుతుడిని తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన మురళిగా గుర్తించారు. ట్రిగ్గర్ ప్రెస్ చేయకపోవడంతో బుల్లెట్ ఛాంబర్లోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ‘వజ్ర ప్రహార్’లో భాగంగా పోలీసులు, ఈగల్ టీమ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.