INDW vs ENGW : సెమీఫైనల్ రేసులో వెనకబడిన భారత జట్టు ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు శుభారంభమివ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు దంచేసి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. హీథర్ నైట్ (109) సెంచరీతో చెలరేగగా ఇంగ్లండ్ అలవోకగా 300 కొడుతుందనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో పుంజుకున్న దీప్తి శర్మ (4-51), శ్రీచరణి(2-68) .. వరుసగా వికెట్లు తీశారు. వీరిద్దరి విజృంభణతో టెయిలెండర్లు చకచకా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. అయితే.. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(22), అమీ జోన్స్ (56) అదిరే ఆరంభమిచ్చారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఈ ద్వయం నిదానంగా ఆడుతూ పవర్ ప్లేలో 44 రన్స్ రాబట్టింది. ఓవర్‌కు 5లోపు రన్‌రేటుతో సాగినప్పటికీ ఆ తర్వాత ఇద్దరూ బ్యాట్ ఝులిపించారు. అయితే.. ప్రమాదకరమైన ఈ ద్వయాన్ని విడదీసింది దీప్తి శర్మ. డేంజరస్ బ్యూమంట్ను బౌల్డ్ చేసి తొలి వికెట్ 73 పరుగుల భాగస్వా్మ్యానికి తెరపడింది. వికెట్ పడిన జోరు తగ్గించని జోన్స్ అర్ధ శతకం పూర్తి చేసింది. కానీ, కాసేపటికే ఆమె దీప్తి ఓవర్లో స్మృతి మంధాన చేతికి చిక్కింది.
Heather Knight’s fastest ODI century to date 👏
Queen. pic.twitter.com/ETXQQxMIUl
— England Cricket (@englandcricket) October 19, 2025
హీథర్ నైట్(87 నాటౌట్), నాట్ సీవర్ బ్రంట్(38)లు జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకొని సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. క్రాంతి గౌడ్ ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో స్కోర్ 200 దాటించింది నైట్. అయితే.. ఈ మెగా టోర్నీలో గొప్పగా రాణిస్తున్న చరణి.. బ్రంట్‌ను వెనక్కి పంపి మూడో వికెట్ అందించింది. బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న నైట్ సింగిల్ తీయబోయి రనౌటయ్యింది. అక్కడితో ఇందగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. సోఫియా డంక్లే(15), అలిసే క్యాప్సీ(2), ఎమ్మా లాంబ్(11) వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో.. 300లకు పైగా కొట్టాల్సిన ఇంగ్లండ్ 288 పరుగులకే పరిమితమైంది.
Innings Break!
4️⃣ wickets for Deepti Sharma 👌
2️⃣ wickets for Sree Charani 🙌A solid comeback with the ball and #TeamIndia restrict England to 288/8 👏
Over to our batters!
Scorecard ▶ https://t.co/jaq4eHbeV4#WomenInBlue | #CWC25 | #INDvENG pic.twitter.com/QIVfJp2tjj
— BCCI Women (@BCCIWomen) October 19, 2025