హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి (Heavy Rain). సోమవారం నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నిల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుమురు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది.
మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 25న తూర్పు, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న ట్టు అంచనావేసింది. 26న వాయుగుండంగా మారి 27న తీరాన్ని దాటే అవకాశాలున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో 27వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.