హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : టీచర్లను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ నుంచి మినహాయిం పు ఇవ్వాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(2)ను సవరించాలని డిమాండ్ చేశారు. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఇన్ సర్వీ స్ టీచర్లంతా ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఉద్యోగంలో చేరి న 20-30 ఏండ్లకు టెట్ పాస్కావాలనడం సరికాదని పేర్కొన్నారు.
స్పందించిన కిషన్‌రెడ్డి త్వరలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపిస్తే, హోంశాఖ నుంచి ఉత్తర్వులిప్పిస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన వెంట పీఆర్టీయూ నాయకులు ఉన్నారు.